Nellore: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లో మోస్ట్ పవర్ ఫుల్ ఇండ్రస్ట్రీయలిస్ట్‌గా కొండేపాటి గంగప్రసాద్‌కు పేరుంది.
తమిళనాడులో బలమైన రాజకీయ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు అయితే గంగప్రసాద్ రెకమండేషన్‌తో ఐదారు మందికి ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తుంటాయని సమాచారం. తెలంగాణలో అయితే బలమైన పోలిటికల్ లీడర్స్ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కీలకమైన బడా లీడర్స్ గంగప్రసాద్‌కు జాన్ జీగిరి దోస్త్‌లుగా ఉంటారంటా…ఇక ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో గంగప్రసాద్ మాటకు, రాజకీయ ఆటకు చాల విలువ ఉందంటా…
Nellore: వుడ్ కాంట్రాక్టర్‌గా, ఇన్ఫ్రా కంపెనీ ఎండీగా, సివిల్ వర్క్స్ కాంట్రాక్ట్స్‌లో కొండేపాటి గంగప్రసాద్‌కు అపారమైన అనుభవం ఉన్నప్పటికి, వందల కోట్ల ఆస్తులతో ఆర్థికంగా బలమైన సామ్రాజ్యం ఉన్నప్పటికి ఎక్కడ గర్వం ఉండదంటా… చిన్నవారితో కూడ మర్యాదగా ఉండటం గంగప్రసాద్ గొప్పతనంగా చెబుతారు.అందుకే జి.పి అనే పేరుని ఆయన అభిమానులు ఒక బ్రాండ్‌గా వాడుతుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైమ్‌లోను, జగన్ టైమ్‌లోను టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థికంగానే కాకుండా,
ఇది కూడా చదవండి: Pawan Kalyan: జనసేన ప్లీనరీ మీటింగ్‌పై పవన్ కళ్యాణ్ దృష్టి
స్థానికంగా ఐదారు నియోజకవర్గాల్లో పార్టీకి సర్వశక్తులు ఒడ్డి అండగ నిలవడంతో జి.పిపైన చంద్రబాబుతో పాటు టీడీపీ కార్యకర్తలకు ఆయన అంటే ఒక నమ్మకం ఏర్పడింది. 2024 ఎన్నికల్లో కూడ గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాలకు పూర్తిగా అన్ని తానై వ్యవహరించి నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపుకు కీలకంగా వ్యవహరించారంటా జి.పి… అందుకే న్యూ ఇయర్ వేడుకల్లో ఆ జోష్ జి.పి గెస్ట్ హౌస్‌లో కనిపించిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
Nellore: గంగప్రసాద్ గెస్ట్ హౌస్ ఉన్న సూళ్లూరుపేటకు జనవరి ఒకటవ తేది ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది బారులు తీరడంతో సూళ్లూరుపేట నేషనల్ హైవే పక్కన ఉండే జ్యోతి గార్డెన్స్ వేలాది మందితో కిక్కిరిసిపోయింది అంటా… ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ మంత్రి, వివిఐపి, లీడర్ ఇళ్ల దగ్గర లేని జనజాతర జి.పి ఇంటి దగ్గర కనిపించడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందాంటా… సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలతో పాటు పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్, ఎలక్ట్రాసిటీ, ఇంజనీరింగ్ ఇలా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు జి.పికి న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు తమ మందీ మర్బలంతో భారీగా తరలిరావడంతో వందల వాహనలతో, వేలాది మందితో జ్యోతి గార్డెన్స్ అంత జాతరలాగ జనంతో నిండిపోయిందంటా… నెల్లూరు, తమిళనాడు, తిరుపతి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచి రాత్రి వరకు వస్తూనే ఉండటంతో రెండు రోజులు పాటు సూళ్లూరుపేటలోనే గంగప్రసాద్ ఉండిపోవాల్సి వచ్చిందంటా..
Nellore: జి.పికి విషెస్ చెప్పేందుకు టీడీపీ ప్రముఖలతో పాటు వైసీపీ నేతలు కూడా తరలిరావడం చూసి గంగప్రసాద్ రాజకీయంగా అజాతశత్రువు అని, కక్షసాధింపు రాజకీయాలకు దూరంగా ఉంటారని, అందుకే అన్ని పార్టీల్లో జి.పిని అభిమానిస్తారని టాక్ నడుస్తుంది. టీడీపీలో పదవులు, హోదావులు ఎంజాయ్ చేసే ఏ బడా లీడర్ చేయనంత జి.పి చేస్తున్నప్పటికి పార్టీ నుంచి ఆశించిన స్దాయిలో సహకారం రావడం లేదని జి.పి అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గంగప్రసాద్ లేకుంటే 2024 ఎన్నికల్లో ఐదారు నియోజకవర్గల్లో టీడీపీ లీడర్స్‌ని సంఘటితంగా నడిపించి, ఆర్థికంగా సపోర్ట్ చేసి, ఎన్నికల యుద్ధానికి సిధ్దం చేసే లీడరే లేరనే వాస్తవన్ని టీడీపీ అధిష్టానం గుర్తించక పోతే పార్టీకి నష్టం తప్పదని జి.పి అభిమానులు స్పష్టం చేస్తున్నారు.
Nellore: అత్మాభిమానంతో పదవులు, కాంట్రాక్ట్‌లు, హోదాలు అడగడం జి.పికి పాతికేళ్లుగా అలవాటు లేదని, దీన్ని గుర్తించి చంద్రబాబు, లోకేష్‌లతో పాటు టీడీపీలో కీలకంగా ఉన్న వ్యక్తులు గంగప్రసాద్ సేవలని గుర్తించి ఆదరిస్తే 2029 ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేస్తామని క్యాడర్ అంటుంది. జి.పిని వాడుకుంటారు, వదిలేస్తారనే ఆయన ఆభిమానులు టీడీపీ అధిష్టానంపై నిరుత్సాహంగా ఉన్నారు. జి.పి ఫ్యాన్స్ అసంతృప్తిని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు, గంగప్రసాద్‌కు విశిష్ట స్థానం ఇచ్చి ఆదరిస్తారా, లేక షరా మాములూగ వాడుకోని వదిలేస్తారా చూడాలి మరీ. ఈ విషయమే న్యూ ఇయర్ వేడుకల్లో హట్ టాపిక్‌గా నడిచింది.
ఇది రాసిన వారు
దినకర్ రాజు
మహాన్యూస్ స్టాప్ రిపోర్టర్
ఉమ్మడి నెల్లూరు జిల్లా..