Neha Shetty: వపన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ చిత్రం షూటింగ్ యమ ఫాస్ట్ గా జరుగుతోంది. థాయ్ లాండ్ లో ఈ సినిమాకు సంబంధించి పాటలను చిత్రీకరిస్తున్నారు. థాయ్ పరిసరాల్లో పవన్ కళ్యాణ్ పై ఓ ఎలివేషన్ సాంగ్ ను, పవన్-ప్రియాంక మోహన్ పై ఓ యుగళ గీతాన్ని, అలాగే ఓ ఐటమ్ సాంగ్ ను తీస్తారట. ఐటమ్ సాంగ్ కోసం నేహాశెట్టిని రంగంలోకి దించుతున్నారట.
ఇది కూడా చదవండి: Radhika Apte: రాధికా ఆప్టే బోల్డెస్ట్ మెటర్మిటీ షూట్
Neha Shetty: ఈ పాటను కూడా థాయ్ లాండ్ లోనే తీయబోతున్నట్లు సమాచారం. ‘డిజె టిల్లు’తో ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది నేహాశెట్టి. అంతే కాదు నేహా ఇప్పటి వరకూ ఐటమ్ సాంగ్ చేయలేదు. పవన్ సినిమా కావటంతో ‘ఓజీ’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈసాంగ్ హిట్ అయితే అమ్మడి దశ మారినట్లే. విశ్వక్ సేన్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నటించినా… ఆ సినిమా ప్లాఫ్ కావటంతో నేహాకు ఆ తర్వాత అవకాశాలు రాలేదు.
Neha Shetty: నేహా కూడా ఆచిచూతి అడుగు వేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో పవన్ ‘ఓజీ’లో ఐటమ్ సాంగ్ ఆఫర్ గోల్డెన్ ఛాన్స్ గా భావించాలి. మరి ఈ పాట నేహాశెట్టికి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.
