NEET 2025 Results: దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్ (NEET) ఫలితాలు చివరకు విడుదలయ్యాయి. మే 5న నిర్వహించిన ఈ జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్షకు దేశవ్యాప్తంగా 20.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ పరీక్ష తెలంగాణ సహా 190 కేంద్రాల్లో విజయవంతంగా నిర్వహించబడింది. తెలంగాణలో మాత్రం 72,507 మంది విద్యార్థులు నీట్‌కు హాజరయ్యారు. ఉత్తమ వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో, ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆసక్తి చూపారు.
విద్యార్థులు ఫలితాలను NEET అధికారిక వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. మెరుగైన ర్యాంకు సాధించిన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మరింత కృషి చేసిన వారికి మెడికల్ కలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ, మిగతా వారిని కూడా ప్రోత్సహించాలి.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: పట్టు బిగుస్తున్న రేవంత్‌రెడ్డి.. శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు

