NBK

NBK: ఫుల్ జోష్ లో బాలయ్య.. అవసరమైతే ఒక రోజు ముందే..

NBK: రీసెంట్ గా తెలుగుతో పాటు హిందీ వెర్షన్ కి డబ్బింగ్ కంప్లీట్ చేశాడు బాలయ్య. మరి చెప్పిన డేట్ కే వస్తారా అంటే.. ఆల్రెడీ సీజీతో పాటు రీ రికార్డింగ్ వర్క్ కూడా ఒకేసారి జరుగుతోంది. ఆగస్టు చివరికల్లా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాన్ ఇండియా రేంజ్ లో.. సెప్టెంబర్ 25నే, అవసరమైతే ఒకరోజు ముందే వస్తాం కానీ ఆలస్యం మాత్రం అవదు అంటున్నారు టీమ్. అలాగే, బాలయ్య-బోయపాటికి షూటింగ్ లో గొడవ జరిగింది అంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు వీరిద్దరి కెరీర్ లోనూ ఎంతో ప్రత్యేకం. ఒకవేళ అలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినా, వీరి రిలేషన్ ముందు అవన్నీ జుజూబీ అన్నట్టు బ్యూటిఫుల్ పిక్ తో క్లారిటీ ఇచ్చారు నటసింహం, ఊరమాస్ డైరెక్టర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *