OTT: ప్రముఖ నటి నయనతార నటించిన సినిమాలు వెండితెర మీద మాత్రమే కాదు ఓటీటీలోనూ డైరెక్ట్ గా దర్శనం ఇస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన ‘టెస్ట్’ మూవీ కూడా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ వంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ థ్రిల్లర్ మూవీని శ్రీకాంత్ డైరెక్ట్ చేశాడు. మొన్నటి వరకూ ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందని అన్నారు కానీ ఇప్పుడు మేకర్స్ డిసిషన్ మార్చుకుని ఓటీటీ రిలీజ్ కు సిద్థపడుతున్నారట. త్వరలోనే ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ‘టెస్ట్’ ఏ రోజున స్ట్రీమింగ్ అయ్యేది తెలియబోతోంది. అయితే ‘జవాన్’ తర్వాత నయన్ మరో హిందీ సినిమాకు సైన్ చేయకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
