Vignesh Shivan: నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ అజిత్ తో సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ‘లవ్ ఇన్యూరెన్స్ కంపెనీ’ పేరుతో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఓ సమావేశంలో ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు విఘ్నేష్. తన ‘ఎల్ఐసి’లో మెయిన్ లీడ్ కి ముందు శివకార్తికేయన్ ని ఎంపిక చేశాడట. అయితే ఈ సైన్స్ ఫిక్షన్ లో భారీ బడ్జెట్ కారణంగా శివకార్తికేయన్ స్థానంలో ప్రదీప్ రంగనాథ్ వచ్చి చేరాడు. ఈ విషయమై మాట్లాడుతూ ‘శివకార్తికేయన్ తో ప్యూఛర్ లో తప్పకుండా సినిమా చేస్తాను. అయితే నిర్మాత ఇప్పుడు ఎందుకు చేయలేము అని అడిగాడు. ఇప్పటి కాలంలో బాహుబలిని చేయాలని ఎవరైనా నిర్మాత అడిగితే చేయగలమా?’ అందుకే ప్రస్తుతానికి ప్రదీప్ తో సినిమా చేస్తున్నా. దీనిలో కృతిశెట్టి హీరోయిన్ గా, ఎస్.జె. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్ర్కీన్ తో కలసి నయనతార నిర్మిస్తోంది’ అని చెప్పారు. మరి శివకార్తికేయన్ కాదనుకున్న సినిమాని ప్రదీప్ తో తీసి విఘ్నేష్ హిట్ కొట్టగలడో? లేదో? చూడాలి.
