Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, తమిళ స్టార్ బ్యూటీ నయనతార కాంబో మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ కామెడీ ఎంటర్‌టైనర్ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ‘సైరా’, ‘గాడ్ ఫాదర్’ తర్వాత చిరంజీవితో నయనతార మళ్లీ జోడీ కట్టడం ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచింది.
ఈ సినిమా కోసం నయన్ దాదాపు రూ. 20కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్‌లో చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ప్రోమోలో నయన్ ‘సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ డైలాగ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ‘వింటేజ్ చిరు’ స్టైల్‌లో అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్‌గా రాబోతోందని సినీ వర్గాల టాక్.
Also Read: vijay devarakonda: రష్మికతో పెళ్లి షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ
Nayanthara: అనిల్ మార్క్ కామెడీ, చిరు ఎనర్జీ, నయన్ క్రేజ్‌తో ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందని అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ జోడీ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కు పండగ లాంటి అనుభవాన్ని అందించనుంది.