Nayanthara

Nayanthara: నయనతారపై తమిళ తంబీల ఆగ్రహం.. టాలీవుడ్‌పై పక్షపాతమా?

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తమిళనాట విమర్శల పాలవుతున్నారు. దీనికి కారణం ఆమె టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొనడమే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం నయనతార తన పాత నియమాలను పక్కన పెట్టడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

గత దశాబ్ద కాలంగా నయనతార తన సినిమాలకు సంబంధించి ‘నో ప్రమోషన్’ అనే కఠినమైన రూల్‌ను పాటిస్తున్నారు. కానీ చిరంజీవి సినిమాలో నటిస్తున్నప్పటి నుండి, అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యేక వీడియోల ద్వారా ప్రమోషన్స్‌లో పాలుపంచుకుంటున్నారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మూవీ టీమ్ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో నయనతార స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడి వద్దకు వచ్చి, “ప్రమోషన్స్ ఏమీ లేవా?” అని అడుగుతారు.

ఇది కూడా చదవండి: Mitchell Starc: బెన్ స్టోక్స్‌ను వదలని స్టార్క్.. అశ్విన్ రికార్డు బద్దలు

ఆమె అడిగిన తీరుకు షాక్ తిన్న అనిల్ రావిపూడి, ఇది కలనా లేక నిజమా అని నిర్ధారించుకోవడానికి తన చేయి తానే గిల్లుకోవడం ప్రేక్షకులను నవ్వించింది. “మీరు ప్రమోషన్స్ చేస్తానని అనడమే పెద్ద ప్రమోషన్” అంటూ అనిల్ వేసిన జోక్, చివరగా చిరంజీవి స్టైల్‌లో నయనతార చెప్పిన డైలాగ్ ఈ ప్రోమోపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.

అయితే, ఈ ప్రమోషన్ వీడియోలను చూస్తున్న తమిళ ప్రేక్షకులు మరియు నిర్మాతలు నయనతారపై మండిపడుతున్నారు. తమిళంలో ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా, కనీసం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా ప్రమోషన్స్ చేయని నయనతార, టాలీవుడ్ పట్ల ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. “తమిళ సినిమాలను టమాటా పచ్చడిలా తక్కువ చేసి చూస్తున్నారా?” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తమిళ నిర్మాతలను ఇబ్బంది పెడుతూ, టాలీవుడ్‌కు మాత్రం వెసులుబాటు కల్పించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నయనతార ఇప్పటి వరకు నేరుగా ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు లేదా ప్రెస్ మీట్‌లకు హాజరు కాలేదు. ఆమె కేవలం సినిమా షూటింగ్‌లో భాగంగా రూపొందించిన ప్రోమోలలో మాత్రమే కనిపిస్తున్నారు. ఈ విషయం తెలియని కొందరు తమిళ అభిమానులు ఆమెపై అనవసరంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రమోషన్ చేయడం అంటే కేవలం ట్రైలర్లలో ఏఐ (AI) షార్ట్స్ వేయడం కాదు కదా, సినిమాలో భాగస్వామ్యం కావడం కూడా ఒక రకమైన మద్దతే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *