Nayantara: కొత్త సంవత్సరంలో నయనతారకు సరికొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. హ్యాపీగా ఫ్యామిలీ కలిసి విదేశాల్లో న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకున్న నయనతారకు ఆ ఆనందాన్ని ఎక్కువ రోజులు ఉంచలేదు ‘చంద్రముఖి’ చిత్ర నిర్మాతలు. ‘నయనతార: బియాండ్ ద ఫెయిర్ టేల్’ డాక్యుమెంటరీపై ఇప్పటికే ధనుష్ 10 కోట్ల కోరుతూ నష్టపరిహారం కేసు వేయగా, తాజాగా ‘చంద్రముఖి’ నిర్మాతలూ అదే బాట పట్టారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: జనసేన ప్లీనరీ మీటింగ్‌పై పవన్ కళ్యాణ్ దృష్టి
Nayantara: తమ అనుమతిలేకుండా మూవీలోని విజువల్స్ ను నయనతార తీసుకుందని, అందుకోసం 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొంటూ వారు నోటీసులు పంపారని తెలుస్తోంది. నయనతార వ్యక్తిగత జీవితంలో ‘నానుమ్ రౌడీ దాన్’కు ఎంత ప్రాధాన్యం ఉందో, రజనీకాంత్ సరసన నటించిన ‘చంద్రముఖి’ చిత్రానికీ కెరీర్ పరంగా అంతే ప్రాధాన్యం ఉంది. మరి ఇప్పటి వరకూ మౌనంగా ఉండి ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు ఎందుకు కేసు వేశారో తెలియదు కానీ… ‘నయనతార: బియాండ్ ద ఫెయిర్ టేల్’ అనే నయనతారకు పీడకలలా మారతుందేమో అనిపిస్తోంది.