Nayanthara

Nayanthara: ‘రాజా సాబ్’ సరసన నయన్!

Nayanthara: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ మూవీ వచ్చే యేడాది ఏప్రిల్ 10న జనం ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మారుతీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ ప్రత్యేకగీతంలో సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయనతార నటించబోతోందని వార్తలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Miss You Promotion: ‘మిస్ యు’ ప్రమోషన్స్ లో సిద్దార్థ్, ఆషికా రంగనాథ్!

Nayanthara: గతంలో ప్రభాస్ సరసన నయనతార ‘యోగి’ చిత్రంలో నటించింది. అలానే మారుతీ దర్శకత్వంలో ‘బాబు బంగారం’లో యాక్ట్ చేసింది. ఆ సినిమా సమయంలో చిత్ర బృందానికి నయనతార సరిగా సహకరించలేదని, ఆమెపై చిత్రీకరించాల్సిన ఓ పాటను తెరకెక్కించకుండానే సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. ‘గాడ్ ఫాదర్’ మూవీ తర్వాత నయనతార ‘రాజా సాబ్’లోని స్పెషల్ సాంగ్ లో నర్తించడం, అదీ మారుతీ డైరెక్షన్ లో కావడం విశేషమే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *