Nayanatara: ప్రముఖ సినీ నటి నయనతారకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. నయనతారపై ధనుష్ వేసిన పరువు నష్టం దావాను కొట్టివేయాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇటీవల వేసిన పిటిషన్‌ను మద్రాస్ న్యాయస్థానం తాజాగా తిరస్కరించింది. నటుడు, నిర్మాత అయిన ధనుష్ అనుమతి లేకుండా అతడి సినిమా క్లిప్స్ వాడుకోవడాన్ని తప్పుబట్టింది.
Nayanatara: నయనతార బయోపిక్‌లో నానుమ్ రౌడీదాస్ సినిమా క్లిప్స్ వాడుకోవడంపై నిర్మాత అయిన ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో కోర్టెకెళ్లాడు. ఈ నేపథ్యంలో పలుమార్లు విచారణ చేపట్టిన మద్రాస్ న్యాయస్థానం నెట్‌ఫ్లిక్స్ అభ్యర్థనను కొట్టేసింది. మరోవైపు బయోపిక్‌పై మధ్యంతర నిషేధం విధించాలన్న ధనుష్ పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
Nayanatara: నటి నయనతార జీవిత కథ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ నయనతార: బియాండ్ ద ఫెయిరీటేల్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని చిత్రీకరించింది. ఇందులో నానుమ్ రౌడీదాస్ సినిమాలోని మూడు సెకన్ల సన్నివేశాన్ని వాడుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా, ధనుశ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే విఘ్నేశ్, నయనతార ప్రేమలో పడ్డారని ప్రచారం ఉన్నది. దీనిపై ధనుశ్ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఖాతరు చేయకపోవడంతో ధనుశ్ కోర్టుకెళ్లారు.
