Nayan Sarika: అదృష్టం అనేది ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. అలా వచ్చినపుడే దానిని ఒడిసి పట్టుకోగలగాలి. ఇప్పుడో యంగ్ హీరోయిన్ ది అదే పరిస్థితి. వారం వారం పలువురు కొత్త తారలు ఎంట్రీ ఇస్తున్న ప్రస్తుత తరుణంలో సక్సెస్ దరిచేరటం ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే అదృష్టం తలుపు తట్టడంతో తెలుగమ్మాయి నయన్ సారికను బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పలకరించాయి. అప్పుడెపుడో ‘చిక్లెట్స్ 2కె కిడ్స్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింద నయన్. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’లోనూ సందడి చేసింది. ఆపై ‘బెంచ్ లైఫ్’ అనే వెబ్ సీరీస్ కూడా చేసింది. అయితే అవేవీ సక్సెస్ ను అందించలేక పోయాయి.
ఇది కూడా చదవండి: Prabhas: ఆ స్టార్ కిడ్స్ అందరి ఫేవరేట్ ప్రభాస్!?
Nayan Sarika: గీతా ఆర్ట్స్2లో నార్నె నితిన్ తో కలసి నటించిన ‘ఆయ్’ సినిమా తనకి తొలి హిట్ అందించింది. పల్లెటూరి అమ్మాయిగా నయన్ నటన, డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా దీపావళికి వచ్చిన ‘క’ సినిమాతో మరో హిట్ కొట్టింది నయన్ సారిక. ఇందులోనూ పల్లెటూరి అమ్మాయిగా అలరించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పలకరించటంతో సంతోషంతో ఉప్పొంగిపోతోంది నయన్. ఇకపై జాగ్రత్తగా అడుగులు వేస్తే టాప్ లీగ్ లోకి ఎంటర్ అవటం పెద్ద కష్టమేమీ కాదు. అయితే సక్సెస్ వచ్చింది కదా అని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అని తొందరపడి ఏది పడితే అది ఒప్పుకుంటే మాత్రం ఎదగటం కష్టం అవుతుంద. మరి నయన్ సారిక తడబడకుండా అడుగులు వేస్తూ ఎంత త్వరగా టాప్ లీగ్ లో ఎంటర్ అవుతుందో చూద్దాం.