Navodaya 2025 Results: దేశంలోని నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 18న ఈ పరీక్ష నిర్వహించిన నవోదయ విద్యాలయ సమితి తాజాగా ఫలితాలను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు అడ్మిట్ కార్డులో ఇచ్చిన తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ఫలితాలు తెలుచుకోవచ్చు.
నవోదయ విద్యాలయాల్లో ఉన్న ఖాళీలను బట్టి అడ్మిషన్ల కోసం రెండు వెయిటింగ్ లిస్టులను రూపొందిస్తారు. అడ్మిషన్‌కు ఎంపికైనా విద్యాలయాల్లో చేరేందుకు ఆసక్తి చూపనివారు, సర్టిఫికెట్లు సమర్పించడంలో విఫలమైనవారి స్థానంలో మిగతా వారికి అవకాశాలు కల్పిస్తారు. మరోవైపు, పర్వత ప్రాంతాల్లో ఏప్రిల్ 12న నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.