Eleven: టాలీవుడ్ యువ కథానాయకుడు నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెవెన్’ సినీ ప్రియుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ లాంచ్ చేయడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ జోనర్‌ల మిళితంగా రూపొందిన ‘లెవెన్’ ట్రైలర్‌లో నవీన్ చంద్ర శక్తివంతమైన పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు.
ట్రైలర్‌లోని హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీన్స్, గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్టైలిష్ విజువల్స్ సినిమా గురించి ఆసక్తిని రెట్టింపు చేశాయి.
సినిమాలో నవీన్ చంద్ర సరసన హీరోయిన్‌గా రియా సుమన్ నటిస్తుండగా, పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు లోకేష్ కథ, స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
Also Read: Ram Charan: లండన్‌లో గ్లోబల్ స్టార్: మేడమ్ టుస్సాడ్స్‌లో వాక్స్ స్టాచ్యూ లాంచ్ కి రెడీ!
Eleven: మే 16న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘లెవెన్’ నవీన్ చంద్ర కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఓటిటిలో మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ ఈసారి ఈ మూవీతో థియేటర్స్ లో కూడా గట్టి హిట్ కొట్టడం ఖాయమటా. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
లెవెన్ – అధికారిక తెలుగు ట్రైలర్ :