Natural Star Nani

Natural Star Nani: విడుదలకు రికార్డులు సృష్టిస్తున్న న్యాచురల్ స్టార్ సినిమా!

Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫాంలో ఉన్నాడు. రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమాతో మరో మాస్ హిట్ కొట్టాడు నాని. ప్రస్తుతం నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ కూడా ఒకటి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇక నానితో అతను చేస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే, ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి పెద్ద అప్డేట్ రాలేదు.కానీ, ఈ సినిమాకు అప్పుడే సూపర్ క్రేజ్ వచ్చింది. ఓవర్సీస్ లో మంచి డీల్ కుదిరినట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: Operation Aranya: అటవీ అక్రమార్కులు.. ఎర్రచందన స్మగ్లర్ల వేట మొదలైంది.. పవన్ కళ్యాణ్ ఆపరేషన్ అరణ్య ప్రారంభమైంది.. 

ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను భారీ డీల్‌కు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్‌లో ఇది హయ్యెస్ట్ ఓవర్సీస్ డీల్ అని టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా విడుదలకు ముందే నాని సినిమా ఓవర్సీస్ రైట్స్‌తో దుమ్ములేపింది.

ఇక నానికి ఓవర్సీస్‌లో సాలిడ్ ట్రాక్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ ఉంటుంది. అందువల్ల ‘ది ప్యారడైజ్’ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు కొనుగోలు చేశారట. మరి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

సరిపోధా శనివారం – భగ భాగ పాట చుడండి:

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bandi sanjay: బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *