Nani: నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ సినీ లవర్స్‌లో హై వోల్టేజ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ శైలేష్ కొలను ఈ స్టైలిష్ కాప్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తుండగా, మే 1న సమ్మర్ స్పెషల్‌గా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. కానీ, ట్విస్ట్ ఏంటంటే.. ‘హిట్ 3’ రిలీజ్‌కు ముందే నాని తన నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ను అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో రూపొందే ఈ చిత్రం 2026 మార్చి 26న థియేటర్స్‌లో సందడి చేయనుంది.
ఈ రెండు భారీ సినిమాల మధ్య ఏడాది గ్యాప్‌తో నాని ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నాడట. సినీ సర్కిల్స్ టాక్ ప్రకారం, ‘హిట్ 3’ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ‘ది ప్యారడైజ్’ స్టార్ట్ కాకముందు.. మరో కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నాని ఫిక్స్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్‌ను స్పీడ్‌గా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’తో హైప్ పీక్స్‌లో ఉన్న నాని.. ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందా? నేచురల్ స్టార్ ఏం సర్‌ప్రైజ్‌లు రెడీ చేస్తాడో చూడాలి!
