NATS: అమెరికా దేశంలో స్థిరపడిన ప్రవాస తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రతిష్ఠాత్మకమైనది. ప్రతిఏటా మాదిరిగానే ఈ ఏడు తెలుగు సంబురాలకు నాట్స్ సిద్ధమైంది. వేలాది మంది ఒకచోటుకు చేరి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా ఏటా వేడుకలు జరుపుకుంటారు. అచ్చమైన తెలుగుదనాన్ని ప్రపంచానికి చాటుతారు. మళ్లీ అలాంటి సందర్భమే 2025 జూన్ నెలలో ఆవిష్కృతం కానున్నది. దానికోసమే అక్కడి వేలాది మంది తెలుగు ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

NATS: అమెరికాలోని టాంపా మహానగరం ఈ సారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) వార్షిక సంబురాలకు వేదిక కానున్నది. ఈ మేరకు జూలై 4, 5, 6 తేదీల్లో నాట్స్ ఎనిమిదవ అమెరికా తెలుగు సంబురాలకు నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు అమెరికా నలుమూలలతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 15,000 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

NATS: ఇది మన తెలుగు సంబురం.. జరుపుకుందాం కలిసి అందరం.. అనే నినాదంతో ఈ సారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) వేడుకలను నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆసాంతం నిర్వహిస్తామని కార్యక్రమాల నిర్వాహకులు వివరించారు.

NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) వార్షిక సంబురాల కోసం ఇప్పటి నుంచి నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు నాట్స్ కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం వేడుకల నిర్వహణ కోసం కావాల్సిన ఏర్పాట్లు, సదుపాయాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి విశేష కృషి చేస్తున్నది.

NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రెసిడెంట్ శ్రీహరి మందడి, చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ఇమ్మీడియట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి వార్షిక వేడుకల నిర్వహణకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గుత్తికొండ బృందం సభ్యులతో ఎప్పటికప్పుడు ఏర్పాట్ల వివరాలను పంచుకుంటూ, వారికి కావాల్సిన సదుపాయాలను చర్చిస్తూ తలమునకలయ్యారు.

NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) వార్షిక వేడుకలకు వచ్చే ప్రతినిధుల కోసం కావాల్సిన ఏర్పాట్ల కోసం ప్రత్యేక వలంటీర్ల బృందం కూడా పనిచేస్తున్నది. వేడుకల్లో పాల్గొనే 15 వేల మంది ప్రతినిధుల కోసం అన్ని ఏర్పాట్లను పక్కాగా చూసుకుంటున్నారు. ప్రతినిధులకు అత్యుత్తమ అనుభూతిని కల్పించేందుకు కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయారు. అన్ని విభాగాలు ప్రత్యేక చొరవతో నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబురాల విజయవంతానికి విశేషంగా కృషి చేస్తున్నాయి.









