National High Ways: మీరు వాహనదారులా? హైవేపై వెళ్లేటప్పుడు టోల్‌ప్లాజాల వద్ద ఉండే టాయిలెట్ల అపరిశుభ్రత విషయం మీ దృష్టికి వచ్చిందా? కానీ, మీరు కామ్‌గా వెళ్లిపోయారా? కానీ, ఇప్పుడు దాన్ని చూసీచూడనట్టు వదిలేయకుండా, ఫిర్యాదు చేసే అవకాశం.. ఎన్‌హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా) మీకు ఇచ్చింది. మీకో బంపర్ ఆఫర్‌ను కూడా అందజేయనున్నట్టు ప్రకటించింది.
National High Ways: టోల్‌ప్లాజాలలోని శుభ్రంగా లేని టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే రూ.1,000 రివార్డ్‌ను ఫాస్టాగ్ ఖాతాలో వేస్తామని ఎన్‌హెచ్ఏఐ ప్రకటించింది. ఇది ఈ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నది. రాజమార్గ్ యాత్ర యాప్‌లో టైమ్ స్టాంప్‌తో పరిశుభ్రత లోపించిన టాయిలెట్లపై ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. వాటిని ఎన్‌హెచ్ఏఐ పరిశీలించి, అర్హత కలిగిన వాటిని గుర్తించి, అవి పంపిన వారికి రివార్డును అందజేస్తుంది. ఎన్‌హెచ్ఏఐ నిర్వహించే టాయిలెట్లకే ఇది వర్తింస్తుందని సంస్థ ప్రకటించింది.

