National High Ways: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. 15 జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రూ.33,690 కోట్లతో 1,123 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించడానికి ముందుకొచ్చింది. ముఖ్యంగా రద్దీ తగ్గించడం, ఇతర రాష్ట్రాలకు రవాణా సదుపాయం పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది.
National High Ways: ఈ 15 జాతీయ రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ సేకరించాల్సి ఉంటుంది. అనుమతుల కూడా రాష్ట్ర ప్రభుత్వమే పొందాలి. ఈ విస్తరణ పనులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. 2028 నాటికి హైవేల విస్తరణ పనులు పూర్తికానున్నాయి. ఈ హైవేలలో జడ్చర్ల,-కోదాడ మధ్య 219 కిలోమీటర్ల మేర చేపట్టే విస్తరణ పనుల్లో అతిపెద్ద ప్రాజెక్టు.
హైవే నంబరు – ఏఏ ప్రాంతాల మధ్య – కి.మీ.
ఎన్‌హెచ్ 63 – బోధన్-నిజామాబాద్ – 36
ఎన్‌హెచ్ 163 – హైదరాబాద్-భూపాలపల్లి – 26
ఎన్‌హెచ్ 167 – జడ్చర్ల-కోదాడ – 219
ఎన్‌హెచ్ 30 – విజయవాడ-జగదల్‌పూర్ వయా రుద్రంపూర్, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ
ఎన్‌హెచ్ 765డీ – హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు-మెదక్ – 63
ఎన్‌హెచ్ 353సీ – పరకాల- భూపాలపల్లి – 61
ఎన్‌హెచ్ 61 – కల్యాణ్- నిర్మల్ – 53
ఎన్‌హెచ్ 365 – నకిరేకల్- తానంచర్ల
ఎన్‌హెచ్ 563 – ఖమ్మం- వరంగల్ -119
ఎన్‌హెచ్ 63 – నిజామాబాద్- జగదల్‌పూర్
ఎన్‌హెచ్ 365 – సూర్యాపేట- జనగామ నర్సంపేట బైపాస్‌రోడ్
ఎన్‌హెచ్ 365బీబీ – ఖమ్మం- సత్తపల్లి – 81
ఎన్‌హెచ్ 163 – మన్నెగూడ- రావులపల్లి – 73
ఎన్‌హెచ్ 167 – మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డు-11
