NASA: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రస్తుతం చారిత్రక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న బడ్జెట్ కోతల నిర్ణయం నాసాను భారీ దెబ్బతీసింది. 2026 ఆర్థిక సంవత్సరానికి నాసా బడ్జెట్‌ను దాదాపు పావు వంతుకు తగ్గించనున్నట్లు సమాచారం. దీంతో నాసాలో పని చేస్తున్న సీనియర్ ఉద్యోగుల్లో 2,145 మందికిపైగా సంస్థను వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
బడ్జెట్ కోతల తీవ్ర ప్రభావం..
నాసాలో జీఎస్-13 నుంచి జీఎస్-15 స్థాయిల్లో ఉన్న సీనియర్ ఉద్యోగులు ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వదిలేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో చాలా మంది అత్యంత ముఖ్యమైన శాఖల్లో పని చేస్తున్న నిపుణులు. అంతరిక్ష ప్రయోగాలు, మానవ అంతరిక్ష ప్రయాణాలు వంటి కీలక ప్రాజెక్టుల్లో ఇలాంటి నిపుణులు లేకపోతే నాసా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇది కూడా చదవండి: Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
ట్రంప్ బడ్జెట్ కోతలతో సైన్స్ ప్రోగ్రామ్‌లు సగానికి తగ్గిపోనున్నాయి. ఉద్యోగ భద్రతపై భయపడుతున్న సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ, బైఅవుట్‌లు వంటి ఆప్షన్‌లను పరిగణలోకి తీసుకుంటున్నారు.
చంద్ర మిషన్, అంగారక యాత్రలకు ముప్పు..!
ఈ భారీ స్థాయిలో ఉద్యోగుల నిష్క్రమణ నాసాకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే నాసా అడ్మినిస్ట్రేటర్ పదవి ఖాళీగా ఉంది. దీనితో ప్రస్తుత సంక్షోభం మరింత పెరిగింది.నాయకత్వ లేమి, బడ్జెట్ అస్థిరత నాసా దీర్ఘకాలిక ప్రణాళికలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ముఖ్యంగా ఆర్టెమిస్ చంద్రయాత్ర ప్రాజెక్ట్, అంగారక గ్రహ మిషన్‌లు గట్టి దెబ్బ తినే అవకాశముంది.
నాసా భవిష్యత్ ప్రశ్నార్థకమేనా..?
నాసా పరిశోధన, మిషన్ల నిర్వహణ, అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో ఉన్న నాయకత్వం అన్నీ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి.
బడ్జెట్ కోతలు ఉద్యోగాల కోల్పోవడమే కాదు.. భవిష్యత్ తరం అంతరిక్ష పరిశోధన, సాంకేతిక పురోగతిపై కూడా దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

