NASA: సునీతా విలియన్స్‌తో సహా వ్యోమగాములందరి పై వస్తున్న వార్తలపై నాసా స్పందించారు. అంతరిక్షం కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియన్స్ బరువు తగ్గినట్లుగా, నీరసంగా ఉన్నట్లు కనిపించడం ఆందోళనకు గురి చేసింది. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లనే ఆమె బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్యాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంపై నాసా స్పందిస్తూ.. సునీతా విలియన్స్‌తో సహా వ్యోమగాములందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని నాసా తెలిపింది. వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతాయని, ఫ్లైట్ సర్జన్లు పర్యవేక్షిస్తారని వెల్లడించింది. సోషల్ మీడియా లో వస్తున్న వార్తలను నమ్మొదని సూచించింది.