Naresh 65th film: నరేష్ 65వ చిత్రం పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. కామెడీ, మిథాలజీ మేళవించిన ఈ ఎంటర్‌టైనర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ఈ సినిమా గురించి ఆసక్తికర వివరాలు చూద్దాం!
Also Read: Mirzapur The Film: మీర్జాపూర్ ది ఫిల్మ్‌లో ఊహించని ట్విస్ట్?
నరేష్ 65వ చిత్రం కామెడీ, మిథాలజీని మేళవించిన ఓ ఫన్ రైడ్‌గా రాబోతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. నాగ చైతన్య క్లాప్ ఇవ్వగా, దర్శకుడు బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. విఐ ఆనంద్ ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశాడు. విజయ్ కనకమేడల, వశిష్ట, రామ్ అబ్బరాజు స్క్రిప్ట్ హ్యాండోవర్ చేశారు.హరీష్ శంకర్ తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. సి.చంద్ర మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నరేష్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. మిథాలజీ నేపథ్యంలో కొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రిలీజ్ డేట్, కాస్ట్ వివరాలపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.