narendra modi

Narendra Modi: కాంగ్రెస్ జలవివాదాలను ప్రోత్సహిస్తూ వచ్చింది

Narendra Modi: జైపూర్‌లో పార్వతి-కల్సింద్-చంబల్-ఈఆర్‌సీపీ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు జాప్యానికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ప్రధాని ఆరోపించారు. పరిష్కారం కనుగొనడానికి బదులుగా, కాంగ్రెస్ రాష్ట్రాల మధ్య జల వివాదాలను ప్రోత్సహిస్తూనే ఉందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ఇది 20 ఏళ్ల నాటి వివాదమని అన్నారు. రెండు రాష్ట్రాలకు ఈ నీటి కానుక ప్రధాని మోదీ వల్లనే నెరవేరింది అని చెప్పారు. ఇదిలావుండగా, ఈ ప్రాజెక్ట్ రాజస్థాన్‌లోని 21 జిల్లాలకు ప్రయోజనం చేకూరుస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అన్నారు. ఇక్కడ 2.5 లక్షల హెక్టార్ల భూమికి కూడా సాగునీరు అందించవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కేంద్రం, రాష్ట్రానికి చెందిన రూ.46 వేల కోట్లకు పైగా పథకాలకు ప్రారంభోత్సవం,  శంకుస్థాపన చేశారు.

ఇది కూడా చదవండి: Telangana Assembly Sessions Live: నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Narendra Modi: ప్రధాని ప్రారంభించిన తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ ముసాయిదా 2017 సంవత్సరంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఆధ్వర్యంలో తయారైంది.  ఇందులోభాగంగా పార్వతి, చంబల్, కలిసింద్ నదులను అనుసంధానం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

దీని ద్వారా తూర్పు రాజస్థాన్‌లోని జైపూర్, ఝలావర్, బరన్, కోటా  వంటి 21 జిల్లాలు ప్రయోజనం పొందుతాయి. ఈ జిల్లాలు నీటి సంక్షోభం నుండి ఉపశమనం పొందుతాయి. అలాగే, రైతులకు సాగునీటితో పాటు ఆయా జిల్లాల ప్రజలకు తాగునీరు కూడా అందుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Road Accident: ఘోర ప్రమాదం.. కూరగాయల లారీ బోల్తా.. 10 మంది మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *