Narayanapet:

Narayanapet: నారాయ‌ణ‌పేట జిల్లాలో దారుణం.. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి తండ్రి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Narayanapet: నారాయ‌ణ‌పేట జిల్లాలో దారుణం చోటుచేసుక‌న్న‌ది. భార్య కాపురానికి రావ‌డం లేద‌ని ఆమె భ‌ర్త తీవ్ర అస‌హ‌నానికి లోన‌య్యాడు. ఘోర‌మైన ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు. చిన్నారులైన క‌న్న‌పిల్ల‌ల‌నే ఈ లోకంలో లేకుండా క‌డ‌తేర్చాడు. తానూ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌నతో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Narayanapet: నారాయ‌ణ‌పేట జిల్లా మ‌రిక‌ల్ మండ‌లం తీలేరు గ్రామానికి చెందిన శివ‌రాములును ఆయ‌న భార్య ఆరేళ్ల క్రితం అత‌న్ని వ‌దిలి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రావ‌డం లేద‌నే కోపం పెంచుక‌న్నాడు. త‌న ఇద్ద‌రు పిల్ల‌లైన రిత్విక (8), చైత‌న్య (5)ను పొలాల వ‌ద్ద‌కు తీసుకెళ్లి గొంతునులిమి చంపి కోయిల్‌సాగ‌ర్ కాలువ‌లో మృత‌దేహాల‌ను ప‌డేశాడు. ఈ విష‌యాన్ని గ్రామ‌స్థుల‌కు ఫోన్ చేసి త‌న పిల్ల‌ల‌ను చంపిన విష‌యం చెప్పాడు.

Narayanapet: ఆ త‌ర్వాత శివ‌రాములు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. స‌మీపంలోని విద్యుత్తు తీగ‌లు ప‌ట్టుకొని చ‌నిపోయేందుకు య‌త్నించ‌గా, విసిరికొట్ట‌డ‌తో గాయాల‌పాల‌య్యాడు. ఆ త‌ర్వాత పురుగుల మందు తాగాడు. దీనిని గ‌మ‌నించిన స్థానికులు శివ‌రాములు ప‌రిస్థితి విష‌మించ‌డంతో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *