Nara Rohith Wedding: నారా కుటుంబంలో పెళ్లి సందడి అంబరాన్నంటింది. యువ కథానాయకుడు నారా రోహిత్, నటి శిరీష వివాహం రాత్రి హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా, గ్రాండ్‌గా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ జంట ఏడడుగులు వేసి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
రాజకీయ ప్రముఖుల ఆశీస్సులు
ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ తదితరులు పెళ్లికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “నారా రోహిత్ పెళ్లి అంటే, మా ఇంటి పండగే” అని పేర్కొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, నారా వారి ఆహ్వానం మేరకు పెళ్లికి వచ్చిన అందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Crime News: పెళ్లైన మూడు రోజులకే నవవధువు ఆత్మహత్య..
‘ప్రతినిధి-2’ నుంచి జీవిత భాగస్వాముల వరకు
నారా రోహిత్, శిరీషల ప్రేమ కథ సినిమా సెట్స్ నుంచే మొదలైంది. రోహిత్ నటించిన ‘ప్రతినిధి-2’ సినిమాలో శిరీష హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా సందర్భంగానే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో, తాజాగా ఈ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
నవ వధువు శిరీష నేపథ్యం
శిరీష స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రెంటచింతల. ఆమె తల్లిదండ్రులకు ఆమె నాలుగో సంతానం.ఆమె ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు అభ్యసించారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉద్యోగం కూడా చేశారు. అయితే, సినిమాల్లోకి రావాలనే ఆసక్తితో భారతదేశానికి వచ్చి ‘ప్రతినిధి-2’ సినిమాలో నటించారు.నూతన దంపతులు నారా రోహిత్, శిరీషల జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ప్రముఖులు ఆశీర్వదించారు.


