Nara Rohit Wedding

Nara Rohit Wedding: నారా రోహిత్‌–శిరీష్ పెళ్లి వీడియో వైరల్..

Nara Rohit Wedding:  టాలీవుడ్ నటుడు నారా రోహిత్, నటి శిరీషల పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది అక్టోబరులో వీరి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరగగా, తాజాగా ఒక ప్రముఖ ఫోటోగ్రఫీ సంస్థ ఈ వేడుకకు సంబంధించిన అందమైన వీడియోను విడుదల చేసింది. ‘ప్రతినిధి 2’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ, ఆ పరిచయాన్ని పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రెంటచింతల గ్రామానికి చెందిన శిరీష, ఆస్ట్రేలియాలో చదువు పూర్తి చేసి సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ వెడ్డింగ్ వీడియోలో పెళ్లి నాటి ముచ్చటైన దృశ్యాలు, కుటుంబ సభ్యుల సందడి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫోటోలతో సరిపెట్టుకున్న అభిమానులకు, ఈ వీడియో ద్వారా వారి పెళ్లి వేడుకను చూసే అవకాశం దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *