Nara Rohit-Sireesha

Nara Rohit-Sireesha: నారా రోహిత్ పెళ్లి పనులు షురూ: హల్దీ వీడియో వైరల్!

Nara Rohit-Sireesha: యువ నటుడు, హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ‘ప్రతినిధి 2’ సినిమాలో తన సరసన నటించిన నటి శిరీష (శిరీ లీలా)ను ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ జంట అక్టోబరు 30న వైవాహిక బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ పెళ్లి వేడుకల సందర్భంగా శనివారం నాడు జరిగిన హల్దీ (పసుపు) కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

పెళ్లి పనులు షురూ
శిరీష కుటుంబ సభ్యులు ఇటీవల తమ ఇంట్లో పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించగా, తాజాగా రోహిత్-శిరీష జంటగా ఫామ్‌హౌస్‌లో హల్దీ ఫంక్షన్‌ను ఘనంగా జరుపుకున్నారు. ఆటలు, పాటలతో ఈ వేడుకలు రెట్టింపు ఉత్సాహాన్ని నింపాయి.

Also Read: Dragon: ‘డ్రాగన్’ స్క్రిప్ట్‌లో మార్పులు..?

సినిమా నుంచి నిజ జీవిత బంధం వరకు
వీరి ప్రేమాయణం ‘ప్రతినిధి 2’ సినిమాతో మొదలైంది. ఈ చిత్రంలో రోహిత్‌కు ప్రియురాలిగా నటించిన శిరీష, ఆ బంధాన్ని నిజ జీవితంలోనూ కొనసాగించారు. ఈ విషయాన్ని ఇద్దరూ తమ కుటుంబ సభ్యులకు చెప్పగా, ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. దీంతో గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఏడడుగులు వేయబోతున్నారు.

నారా రోహిత్ సినీ ప్రయాణం
నారా రోహిత్ సినీ ప్రస్థానం గురించి చెప్పాలంటే, ఆయన ‘బాణం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘సోలో’ సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెల్లో’, ‘అసుర’, ‘జ్యో అచ్యుతానంద’, ‘శమంతకమణి’ వంటి పలు విభిన్న కథాంశాలున్న చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో వచ్చిన ‘వీర భోగ వసంత రాయలు’ తర్వాత రోహిత్ దాదాపు ఆరేళ్ల విరామం తీసుకున్నారు. ఇటీవల ‘ప్రతినిధి 2’తో రీ-ఎంట్రీ ఇచ్చినా, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ, ఈ ఏడాది ‘భైరవం’, ‘సుందరకాండ’ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *