Nara Lokesh

Nara Lokesh: మా పవన్ అన్న సినిమా కోసం.. ఓ అభిమానుల్లాగే ఎదురు చూస్తున్నాను

Nara Lokesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న “హరిహర వీరమల్లు” చివరికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చారిత్రక యాక్షన్ ఎంటర్‌టైనర్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే విభిన్నమైన చిత్రం కావడం విశేషం.

పురాణ నేపథ్యంతో, అద్భుతమైన సెట్‌లు, ఘనమైన యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగలా మారబోతోంది. పవర్ స్టార్ స్వాగ్, మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్‌గా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్‌ ద్వారా ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి.

నారా లోకేష్ సినిమా గురించి స్పందిస్తూ.. మా పవన్ అన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ‘హరిహర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *