Nara lokesh: కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

