Nara Lokesh: సింగపూర్‌లో జరిగిన తెలుగు ప్రవాసుల సమావేశంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. APNRT ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఫార్ ఈస్ట్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు.
లోకేష్ మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు ఆ దారితప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో అందరూ చూస్తున్నారు అని లోకేష్ పేర్కొన్నారు.
తెలుగు వారి ఆత్మగౌరవం.. టీడీపీ లక్ష్యం
ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల తెలుగు ప్రజలు ఉన్నారని, వారిని గౌరవించేది, వారి ఆత్మగౌరవం కోసం పోరాడేది టీడీపీ పార్టీనే అని లోకేష్ తెలిపారు. నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గర్వకారణమని, ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వారసుడు చంద్రబాబే అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Bhubaneswar Metro Rail: భువనేశ్వర్ మెట్రో ప్రాజెక్ట్‌ను రద్దు చేసిన ప్రభుతవం.. ఎందుకంటే..?
ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారు ఉన్నారంటే, అది చంద్రబాబు నాయుడు విజనరీ పాలన ఫలితమే అని లోకేష్ అభిప్రాయపడ్డారు.
ఐటీ రంగంలో తెలుగు జాతి గర్వకారణం
“ఒకప్పుడు ఐటీ రంగం అంటే కంప్యూటర్లు తిండి పెడతాయా? అని కొందరు ఎగతాళి చేసేవారు. ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా చంద్రబాబును విమర్శించారు. కానీ ఈరోజు అదే ఐటీ రంగం ద్వారా తెలుగువారు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అదే నిజమైన విజనరీ.. అదే సీబీఎన్ బ్రాండ్” అని లోకేష్ స్పష్టం చేశారు.
చంద్రబాబుకు ఐటీ నిపుణుల మద్దతు
చంద్రబాబు అరెస్టయినప్పుడు, హైదరాబాద్‌లో 45 వేల మంది ఐటీ నిపుణులు ఆయనకు అండగా నిలిచారు అని లోకేష్ గుర్తుచేశారు. అదే ధైర్యం మాకు ఇచ్చిందని, తెలుగు జాతి అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలవాలని అప్పుడు నిర్ణయించుకున్నామని అన్నారు.