Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పులివెందుల రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన “పులివెందులలో 45 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం నిలబడింది. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగే చోట ఈసారి 11 మంది పోటీలో నిలబడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి గెలుపు” అని అన్నారు.
వైసీపీ ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, అందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Viral News: గొర్రెల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న వ్యక్తి..
నామినేటెడ్ పదవులు రాకపోయిన వారిని ఉద్దేశించి లోకేష్.. “నిరాశ పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో అందరికీ న్యాయం చేస్తాం” అని హామీ ఇచ్చారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు సెమీకండక్టర్ యూనిట్ రావడం శుభ పరిణామమని, ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

