Nara Lokesh:

Nara Lokesh: ఏఐ క్యాపిటల్ గా అమరావతి.. సత్య నాదెళ్లతో లోకేష్ భేటీ

Nara lokesh: సీఎం చంద్రబాబు నేతృత్వంలో హైదరాబాద్ నగరం ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంద‌ని, ప్రస్తుతం 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన బాబు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నార‌ని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరం అని పేర్కొన్నారు.

ఏఐ క్యాపిటల్‌గా అమరావతిని తీర్చిదిద్దుతాం..
క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫాంలను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్‌ సెక్యూరిటీని మెరుగుపరచడం వంటి స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఏపీ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారం కావాల‌ని స‌త్య నాదేళ్ల‌తో అన్నారు. ఏఐ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తయారు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Nara Lokesh: అమెరికాలోనూ మంత్రి నారా లోకేష్ కు అభిమానుల తాకిడి

Nara Lokesh:: ఇందులో భాగంగా అమరావతిలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్న‌ట్టు తెలియ‌జేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐటీ నిపుణులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన సేవలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. ఏపీలో ఐటీ, ఇంజనీరింగ్ టాలెంట్ పై దృష్టి సారించాల్సిందిగా స‌త్య నాదేళ్ల‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముకగా పేర్కొన్నారు. అందుకే అగ్రిటెక్ కు ఏఐని అనుసంధానించడం వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయ‌న్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్ట్రీమ్‌లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతో ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వాణిజ్యరంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు.

ఏపీలో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్ వ్యూహాత్మక లాజిస్టిక్ లకు అనువుగా ఉంటాయ‌ని తెలిపారు. దీనికి బలమైన పర్యావరణ వ్యవస్థ మద్దతుగా నిలుస్తుంద‌న్నారు.చంద్రబాబు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్ టెక్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సిందిగా కోరారు. ఏపీలో నెలకొన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఒకసారి రాష్ట్రానికి వచ్చి పరిశీలించాల్సిందిగా మైక్రోసాఫ్ట్ సీఈఓతో మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశోధించాల‌ని కోరారు.

ALSO READ  Chandrababu Naidu: మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *