Nara lokesh: ఆ వేడుకలో జగన్‌కు ఆహ్వానం

Nara lokesh: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మెగా డీఎస్సీలో 16,000 మంది ఉపాధ్యాయులుగా ఎంపికైన విషయం తెలిసిందే. వీరందరికీ నియామక పత్రాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని విశేషంగా, వేడుకల మాదిరిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. డీఎస్సీ ద్వారా ఎంపికైన వారందరికీ త్వరలోనే నియామక పత్రాలను అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఈ వేడుకకు పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

దీంతో ఈ నియామక పత్రాల కార్యక్రమం కేవలం ప్రభుత్వ అధికారిక వేడుకగానే కాకుండా, రాజకీయ ప్రాధాన్యతను కూడా సంతరించుకోనుంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *