nara lokesh

Nara Lokesh: అమెరికాలోనూ మంత్రి నారా లోకేష్ కు అభిమానుల తాకిడి

Nara Lokesh: పెట్టుబడుల సాధన కోసం అమెరికా వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు అక్కడ కూడా అభిమానుల తాకిడి తప్పలేదు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఒకవైపు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలతో క్షణం తీరికలేకుండా బిజీబిజీగా ఉంటూనే… మరోవైపు తమను కలిసేందుకు వచ్చిన అభిమానులను నిరాశపర్చకుండా ఫోటోలు దిగారు. శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి బసచేసిన ఫోర్ సీజన్స్ హోటల్ వద్దకు వచ్చిన సుమారు 200 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఫోటోలు దిగిన లోకేష్ వారిని ఆప్యాయంగా పలకరించి వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు.

Nara Lokesh: ఇదిలావుండగా 2వరోజు మంత్రి లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. గూగుల్ సిటిఓ ప్రభాకర్ రాఘవన్, జనరల్ అటమిక్స్ సిఇఓ డాక్టర్ వివేక్ లాల్, నియోట్రైబ్ వెంచర్స్ ఫౌండర్ కిట్టూ కొల్లూరి, జనరల్ కేటలిస్ట్స్ ఎండి నీరజ్ అరోరా, ఐ స్పేస్ ప్రెసిడెంట్ రాజేష్ కొత్తపల్లి, సిఎఫ్ఓ ప్రసాద్ పాపుదేసి, గూగుల్ మాజీ అధికారి సారిన్ సువర్ణ, స్మియోటా కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ వన్ టు వన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలను మంత్రి లోకేష్ వారికి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *