Nara Lokesh: టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో యువనేత నారా లోకేష్ చేసిన ప్రసంగం తెలుగు తమ్ముళ్లలో తిరుగులేని జోష్‌ని నింపుతోందా? అదే సమయంలో ప్రత్యర్థుల శిబిరంలో ప్రకంపనలు సృష్టించేలా లోకేష్ ప్రసంగ శైలి కనపడిందా? తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కి, దాని 43 ఏళ్ల ప్రస్థానానికి, ఎన్టీఆర్ లెగసీకి నీరాజనం పట్టారు నారా లోకేష్. తమ్ముళ్లకు రోమాలు నిక్కబొడుచుకునేలా, గుండెల్లో ఫైర్‌ని రగిల్చేలా లోకేష్ ప్రసంగం ఉందంటున్నారు పరిశీలకులు. ఇంతకీ లోకేష్ ప్రసంగంలో ఏం మారింది? కొత్తగా ఏం యాడ్ అయ్యింది? ఈ ప్రసంగం ద్వారా లోకేష్ తనని తాను ఎలా ఆవిష్కరించుకున్నారు? ఈ స్టోరీలో చూద్దాం.
మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడకొట్టాయి. ఆ మూడు అక్షరాలే తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయి. అవి మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం… ఆ ప్రభంజనం పేరే ఎన్టీఆర్.
తెలుగు దేశం జెండా పీకేస్తాం అని ఎంతో మంది వచ్చారు. అలాంటి వారు అడ్రస్ లేకుండా పోయారు.
లోకేష్ బైట్ – క్లైమోర్ మైన్లకే భయపడని బ్లడ్ మనది. కామిడీ పీసులకు భయపడతామా?
43 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ప్రత్యర్ధులు మీద పడుతున్నా మీసం మెలేసి తొడకొట్టిన అంజిరెడ్డి తాత లాంటి కార్యకర్తలు మన ధైర్యం. మెడ మీద కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై టిడిపి, జై చంద్రబాబు అంటూ ప్రాణాలొదిలిన చంద్రయ్య లాంటి కరుడుగట్టిన కార్యకర్తలు మన పౌరుషం. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి రక్తమోడుతున్నా పోలింగ్ బూత్ నుంచి కదలని మంజుల లాంటి కార్యకర్తలు మన దమ్ము. 43 ఏళ్లుగా పార్టీకి, పసుపు జెండాకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి నా పాదాభివందనం.
ఇవీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో లోకేష్ ప్రసంగంలో ల్యాండ్ మైన్స్‌లా పేలిన డైలాగులు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం కంటే కూడా యువనేత, ఆపార్టీ భవిష్యత్ రథసారధి నారా లోకేష్ చేసిన ప్రసంగం కార్యకర్తలను ఒక ఊపు ఊపేసింది. ఒక్కో డైలాగ్‌తో టీడీపీకి, పార్టీ కార్యకర్తలకు లోకేష్ ఇచ్చిన ఎలివేషన్.. లోకేష్ ప్రసంగానికి పూర్తిగా కొత్తదనాన్ని తీసుకొచ్చింది. క్లాస్ ఇమేజ్ ఉన్న టీడీపీకి గ్రౌండ్ లెవెల్‌లో మాస్ క్యాడరే ఎక్కువ. ఇప్పుడు వారి ఆకలి తీరేలా లోకేష్ మాటలు ఉంటున్నాయి.
ఇది కూడా చదవండి: Ponguleti Srinivas: ఆ కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం
పూర్తిగా లోకేష్ మాస్ లీడర్‌గా, ప్రజాకర్షక నేతగా పొలిటికల్ తెరమీద ఆవిష్కృతమవుతున్నారని చెప్పడానికి లోకేష్ ఇవాల్టి ప్రసగంమే ఉదాహరణ. పూర్తిగా కార్యకర్తల కోసం ప్రాణం పెట్టే నాయకుడిలా లోకేష్ తెలుగుదేశం క్యాడర్‌కి కనిపిస్తున్నారిప్పుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోకేష్ చేసిన ప్రసంగం ఒక మైలు రాయిలా నిలిచిపోతుందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగుదేశం అంటేనే క్యాడర్ కష్టంపై పునాదులు నిర్మితమైన పార్టీ. ఇక్కడ అధినేత అంటూ ఎవ్వరూ లేరు. అధినేత అయినా, నాయకులైనా.. పార్టీ పర్యవేక్షకులు మాత్రమే. రాజైనా, మంత్రి అయినా.. టీడీపీలో కార్యకర్తేనని చాటి చెప్పారు నారా లోకేష్. ఎన్టీఆర్, చంద్రబాబు వారసత్వం తనది కాదనీ… వారసులు కార్యకర్తలేనని చెప్పారంటేనే.. లోకేష్ ఎంత పరిణతి సాధించారో అర్థమౌతోందంటున్నారు విశ్లేషకులు.
టీడీపీ క్యాడర్‌లో జోష్ నింపేలా, టీడీపీకి మరో 40 ఏళ్ల పాటు దిశ, దశలను నిర్దేశించేలా, 43 ఏళ్లు అండగా నిలబడ్డ క్యాడర్‌కి సంపూర్ణ న్యాయం చేసేలా, భవిష్యత్‌లో క్యాడర్‌కి పెద్ద పీట వేసేలా, క్యాడర్ నుండే లీడర్లను తయారు చేసేలా, క్యాడర్‌కే పార్టీ పదవులు కట్టబెట్టేలా, అర్థ శతాబ్ధానికి చేరువలో ఉన్న టీడీపీకి కొత్త రక్తం ఎక్కించి, మరో 4 దశాబ్దాలు సైకిల్ జైత్ర యాత్ర కొనసాగించేలా.. లోకేష్ ఇచ్చిన సందేశం.. నిజంగానే ఆ పార్టీ చరిత్రలో ఓ మైలు రాయిలాంటిది. ఇన్ని డైలాగులు చెప్పుకున్నాక… ఆ ఒక్క పంచ్ డైలాగ్ మిస్ అవుతే.. తమ్ముళ్లు ఫీల్ అవుతారేమో. ఆ మాస్ డైలాగ్ లోకేష్ స్పీచ్‌కి పవర్ ఫుల్ క్లైమ్యాక్స్.
రెడ్ బుక్ పేరు చెప్తే గుండెపోటు వస్తోంది. రెడ్‌బుక్ పేరు చెప్తే బాత్రూమ్‌లో కిందపడి చెయ్యి విరగ్గొట్టుకుంటున్నారు. అర్థమైందా రాజా?