Nara lokesh: తునిలో గురుకుల పాఠశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచారయత్నం ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా షాక్‌కు గురిచేసిందని తెలిపారు.
“పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘోర చర్యలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తాం” అని లోకేష్ హెచ్చరించారు.
అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
“పిల్లల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తప్పవు” అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.