Nani: న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా స్థాయి నుంచి హాలీవుడ్ రేంజ్‌కు ఎదగడానికి సిద్ధమవుతున్నాడు. ‘ది ప్యారడైజ్’ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయనున్నాడు. హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్‌ను ఈ చిత్రంలో భాగం చేశాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న బహుభాషల్లో విడుదల కానుంది.
Also Read: Mass Jathara Review: మాస్ జాతర మూవీ రివ్యూ – రవితేజ మాస్ డోస్
మంచి కథలతో అభిమానులను అలరిస్తున్న నాని పాన్ ఇండియా గుర్తింపు సాధించాడు. ఇప్పుడు హాలీవుడ్‌కు అడుగుపెట్టేందుకు ‘ది ప్యారడైజ్’తో ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా భాషలతోపాటు ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లోనూ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు నాని హాలీవుడ్ నటుడు ర్యాన్ రేనాల్డ్స్‌ను రంగంలోకి దింపాడు. మూడు నెలలుగా ర్యాన్ ప్రతినిధులతో చర్చలు జరిపిన మేకర్స్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నారు. ర్యాన్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇది నిజమైతే ఈ చిత్రానికి గ్లోబల్ గుర్తింపు లభించినట్లే. అన్ని భాషల్లో ప్రముఖ నటులను దింపుతూ నాని తనను, తన సినిమాను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో న్యాచురల్ స్టార్ విజయం సాధిస్తాడా లేదా చూడాలి.

