Nani-Sailesh

Nani-Sailesh: నాని-శైలేష్ కాంబో రిపీట్! ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్!

Nani-Sailesh: నాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను రూపొందించిన ‘హిట్ 3’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నాని కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో జరిగిన సక్సెస్ మీట్‌లో నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సక్సెస్ మీట్‌లో నాని సంచలన ప్రకటన చేశాడు. శైలేష్‌తో మరో సినిమా ఖచ్చితంగా ఉంటుందని, అయితే ఈసారి ‘హిట్ 3’ లాంటి యాక్షన్ థ్రిల్లర్ కాకుండా ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్టు వెల్లడించాడు.

“శైలేష్ ఓ హిలేరియస్ స్టోరీ లైన్ చెప్పాడు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ సినిమా అదిరిపోతుంది!” అంటూ నాని హామీ ఇచ్చాడు. ఈ కామెంట్స్‌తో నాని-శైలేష్ కాంబో నుంచి నాన్-వైలెన్స్, ఫన్ ఫిల్డ్ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘హిట్ 3’ సక్సెస్ తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *