Nani: నాచురల్ స్టార్ నాని మరోసారి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ‘హాయ్ నాన్న’ లాంటి ఫీల్‌గుడ్ హిట్ ఇచ్చిన దర్శకుడు శౌర్యువ్‌తో నాని మళ్లీ చేతులు కలిపాడు. ఈసారి మాస్ మసాలా సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అయ్యాడు.
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అయితే, నాని తన కెరీర్లో మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘హాయ్ నాన్న’ వంటి హృదయాన్ని హత్తుకునే చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు శౌర్యువ్‌తో నాని మరోసారి జతకట్టాడు. ఈ కొత్త సినిమా మాస్ కంటెంట్‌తో నాని కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకునే చిత్రంగా నిలవడం పక్కా అని సమాచారం. ఎందుకంటే శౌర్యువ్ ఈసారి నాని కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. ఈ స్క్రిప్ట్ నానికి తెగ నచ్చేసిందట. ఇందులో నాని పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందట. మరి ఈ కాంబో నుంచి రాబోయే రెండవ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!