Nani: నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 3’ మరికొన్ని గంటల్లో వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు సిద్ధమైంది. దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన ఈ చిత్రంతో నాని మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనడంతో, నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే ప్రొడక్షన్ ఖర్చు రికవరీ అయినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
థియేటర్స్ నుంచి వచ్చే వసూళ్లు పూర్తిగా లాభమేనని ఇన్‌సైడ్ టాక్. గతంలో నాని నిర్మించిన ‘కోర్ట్’ చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది. బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో లాభాల బాట పట్టిన నాని, తన సత్తాను బాక్సాఫీస్ వద్ద చాటుతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. ‘హిట్ 3’లో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నాని ఈసారి ఏ రేంజ్‌లో హిట్ కొడతాడో చూడాలి!