HIT 3 Teaser: న్యాచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం హిట్ 3. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.ఊహించని విధంగా ఉంది ఈ టీజర్.ఈ సినిమాలో నాని పవర్ ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
Also Read: Mazaka Paid Premieres: మజాకా పెయిడ్ ప్రీమియర్స్.. ఒకరోజు ముందుగానే..!
ఇది వరకే విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. పోలీస్ కు తక్కువ, విలన్ కు ఎక్కువ అన్నట్లుగా అర్జున్ సర్కార్ పాత్రను చూపించారు. మునుపెన్నడూ చూడని విధంగా నాని ఈ సినిమాలో కనిపించనున్నాడని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
నాని రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తోంది. ఈ టీజర్ ని కంప్లీట్ వైలెన్స్ తో నింపేశాడు దర్శకుడు. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది మే 1న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
HIT 3 టీజర్ : సర్కార్స్ లాఠీ | నాని | శైలేష్ కొలను :
