nani

Nani: కోర్ట్ మూవీపై కొండంత ఆశలు పెట్టుకున్న నాని!

Nani: కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘కోర్ట్‌‘-స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ’. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నాని వాల్‌ పోస్టర్‌ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో హర్ష రోషన్‌, శ్రీదేవి జంటగా నటిస్తున్నారు.శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇక ఈ చిత్రం హోలీ సందర్భంగా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నాని మాట్లాడుతూ.. తాను సినీ పరిశ్రమలోకి వచ్చి 16 ఏళ్లు దాటిందన్నారు. అయినప్పటికి ఇప్పటి వరకు ఫలానా సినిమా చూడాలని తానెప్పుడు చెప్పలేదన్నారు. కానీ.. కోర్టు మూవీని ప్రతి ఒక్కరు చూడాలన్నారు. ఒకవేళ ఈ చిత్రం అంచనాలను అందుకోలేకుంటే మరో రెండు నెలల్లో విడుదల కానున్న తన చిత్రం హిట్ 3ని ఎవరూ చూడొద్దని నాని కామెంట్స్ చేశారు. దీన్ని బట్టి నాని ఈ సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Allu Arjun: బన్నీ - త్రివిక్రమ్ మూవీ వచ్చేది అప్పుడే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *