The Paradise: నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రం ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా షూటింగ్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భవ్యమైన ఇల్లు నిర్మిస్తున్నారట. ఫలక్‌నామా ప్యాలెస్ గ్రాండ్‌ను పోలి ఉండే ఈ సెట్‌కు దాదాపు రూ.7.5 కోట్లు చేస్తున్నారని టాక్. అయితే ఇంత ఖర్చుతో ఈ నిర్మాణం ఎందుకు జరుగుతుందో చూద్దాం.
Also Read: Shobana: ‘పెద్ది’లో శోభనా కీలక పాత్ర?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్‌బాబు నటవిశ్వరూపం మరోసారి ప్రదర్శించబడుతోంది. ఆయన నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పాత్ర కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ఒక భవ్యమైన ఇల్లు నిర్మాణం జరుగుతోంది. ఈ సెట్ ఫలక్‌నామా ప్యాలెస్ గ్రాండ్‌ను గుర్తుచేసేలా రూపొందుతోంది. నిర్మాణ ఖర్చు రూ.7 నుంచి రూ.7.5 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. ఈ సెట్‌లో చిత్రీకరణ జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే చిత్ర బృందం డిసెంబర్ లేదా జనవరి నెలలో మరో గ్లింప్స్ రకం కంటెంట్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ గ్లింప్స్ చిత్రం గురించి మరింత ఉత్కంఠను రేకెత్తించే అవకాశం ఉంది. ఈ సెట్ నిర్మాణం పూర్తయిన తర్వాత చిత్రీకరణ వేగం ఇంకా పుంజుకునే అవకాశం ఉంది.
