Nandigam Suresh

Nandigam Suresh: జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్‌..

Nandigam Suresh: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. గతంలో తుళ్లూరులో టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై జరిగిన దాడి కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో నందిగం సురేష్‌తో పాటు ఆయన భార్య, సోదరుడు, మిత్రులు కూడా ఉన్నారని తెలుస్తోంది. గుంటూరు కోర్టు జూన్ 30న బెయిల్ మంజూరు చేసినా, షూరిటీ (రూ.10,000) సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఒక రోజు తర్వాతే ఆయన విడుదలయ్యారు.

బెయిల్ షరతుల ప్రకారం, సురేష్ ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలి. అలాగే సాక్షులను బెదిరించకూడదు, పోలీసులకు అందుబాటులో ఉండాలి.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత: సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన సురేష్ మాట్లాడుతూ, “నేను ఎలాంటి తప్పు చేయలేదు. టీడీపీ నాయకులు చంద్రబాబు, లోకేష్‌లు రాజకీయ కక్షతో నాపై అక్రమ కేసులు పెట్టారు. ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారు. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు,” అని అన్నారు.

అలాగే, “జగనన్న నాకు దేవుడితో సమానం. నా శ్వాస ఉన్నంతవరకూ ఆయనతోనే ఉంటాను. ఎంత కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాను,” అని భావోద్వేగంగా చెప్పారు.

మరియు, “ప్రజలు ఇప్పుడే చిత్తశుద్ధిగా అర్థం చేసుకుంటున్నారు… కూటమి పాలనలో న్యాయం కనిపించటం లేదు, కక్షలు పెరిగిపోయాయి. ఇది దేవుడికే తెలుసు,” అని తేల్చిచెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *