NTR Raju

NTR Raju: స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వీరాభిమాని ఎన్టీఆర్ రాజు పాడె మోసిన నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి రామ కృష్ణ, నందమూరి మోహనకృష్ణ

NTR Raju: స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వీరాభిమాని, అందరితో ‘ఎన్టీఆర్ రాజు’గా పిలిపించుకునే రామచంద్ర రాజు మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
గురువారం ఆయన భౌతికకాయానికి నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ రూప, నందమూరి చైతన్య కృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు, శాప్ ఛైర్మన్ రవి నాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ,    NTR Raju

తిరుపతి టౌన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మురళి, ఎక్స్ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీనాథ్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, అడిషనల్ ఈవో అంకం చౌదరి, పలువురు రాజకీయ ప్రముఖులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

NTR Raju

ఇది కూడా చదవండి: Rakul Preet Singh: అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, నాయకులు మాట్లాడుతూ… రామచంద్ర రాజు అనే పేరు కంటే ‘ఎన్టీఆర్ రాజు’గానే ఆయన ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ పట్ల ఆయన చూపిన అభిమానం వెలకట్టలేనిదని అన్నారు. అటువంటి వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.NTR Raju

ఎన్టీఆర్ రాజు టీటీడీ బోర్డు సభ్యులుగా చేసిన సేవలు వెలకట్టలేని కొనియాడారు. రెండు సార్లు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉంది కూడా రూపాయి వేతనం తీసుకోకుండా ఆయన టీటీడీకు చేసిన సేవలు, భక్తులకు అందించిన సదుపాయాలు లెక్కలేనివి. నందమూరి తారక రామారావు ప్రతి సినిమా రీళ్ల బాక్స్ లను స్వామి స్వామి వారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసేవారనీ ఈ సందర్భంగా ఆయన అభిమానాన్ని స్మృతించుకున్నారు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

NTR Raju

NTR Raju

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *