మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. తన కుటుంబం పై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23 కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
మరోవైపు ఇదే కసులో మాజీ మంత్రి కేటిఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షులుగా మాజీ మంత్రి సత్యవతి రాథో డ్ దాసోజు శ్రవణ్ తదితరులను చేర్చారు