nampally: హత్య కేసులో నిందితుడిగా ఉన్న యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చిన ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, పాతబస్తీ బాబా నగర్‌కు చెందిన అయాన్ ఖురేషి (20) తన బావ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గురువారం నాంపల్లి కోర్టులో హాజరయ్యేందుకు వెళ్లిన అయాన్, కోర్టు పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో, నిలోఫర్ హోటల్ సమీపంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై ఆకస్మికంగా కత్తులతో దాడి చేశారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన అయాన్ ఖురేషి, సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు
స్థలాన్ని డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ సంజయ్‌లు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు పాల్పడిన నిందితుల గుర్తింపు మరియు పట్టుకోవడానికి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ హత్యకు ఎదురుతిరుగల కక్షలు గలవారా అన్న కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు.