Thandel: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘తండేల్’. శ్రీకాకుళం జిల్లాలోని జాలర్ల జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ దీనిని ప్రొడ్యూస్ చేస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు దీనిని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాలోని ‘నమో నమః శివాయా’ అనే గీతం విడుదలైంది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దీనిని రాయగా, అనురాగ్ కులకర్ణి, హరిప్రియ గానం చేశారు. శివరాత్రి సందర్భంగా వచ్చే ఈ గీతాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ వేసి హీరోహీరోయిన్ల తో పాటు పలువురు డాన్సర్ల పై చిత్రీకరించారు. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘తండేల్’ పాన్ ఇండియా మూవీగా ఫిబ్రవరి 7న రాబోతోంది.