Nallagonda: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతురుపై తండ్రి లైంగికదాడికి పాల్పడిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కామాంధుడికి కఠిన శిక్షను అమలు చేసింది. ఆరో తరగతి చదువుతున్న ఆ మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై ఆ దుండగుకి ఏడాది తర్వాత కోర్టు శిక్షను ఖరారు చేసింది. శిక్షతోపాటు జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది.
Nallagonda: నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కట్టంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆంజనేయులు 2023 డిసెంబర్ 14న ఆరో తరగతి చదువుతున్న తన కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగింది. నిందితుడిపై నేరం నిరూపణ కావడంతో 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి తాజాగా తీర్పునిచ్చారు.
Nallagonda: కన్నకూతుళ్లపై కామాంధులైన తండ్రులు లైంగికదాడులకు పాల్పడుతున్న ఘటనలను సభ్యసమాజం ఖండిస్తూనే ఉన్నది. కఠిన శిక్షలు అమలవుతూనే ఉన్నా, ఇంకా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళనకరం. ఇంకా కఠిన శిక్షలు అమలైతేనే ఇలాంటి దుర్ఘటనలను రూపుమాపే అవకాశం ఉంటుందని మానవతావాదులు కోరుతున్నారు.