Nagarjuna

Nagarjuna: పాన్ ఇండియా సినిమాలపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

Nagarjuna : భారతీయ చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల నిపుణులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో అగ్ర నటుడు నాగార్జున ‘తెలంగాణ పెవిలియన్’ స్టాల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాన్ ఇండియా సినిమాలు, దర్శకుడు రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేటి ప్రేక్షకులు హీరోలను లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో చూడాలనుకుంటున్నారు.

‘బాహుబలి’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ విజయాలకు అదే కారణం. ఉత్తరాది ప్రేక్షకులు కూడా పుష్పరాజ్, యశ్ లాంటి హీరోలను చూడటానికి ఇష్టపడుతున్నారు. రోజువారీ ఒత్తిడిలో ఉన్న ప్రజలు సినిమాలతో ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటారు. అందుకే తెరపై మాయాజాలం చూపించాలి,” అని నాగార్జున అన్నారు.

Also Read: Virat Kohli-Simbu: విరాట్ కోహ్లీ బయోపిక్‌లో సింబు? సోషల్ మీడియాలో హాట్ టాపిక్!

Nagarjuna: “భారతీయ సినిమాలు ప్రాంతీయతను కోల్పోకుండా, స్థానిక కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రాజమౌళి ‘బాహుబలి’లో ప్రతీ సన్నివేశంలో తెలుగుతనం ప్రతిఫలించేలా తీశారు. అందుకే అది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. మాతృభాషపై దృష్టి పెట్టి కథ చెబితే ప్రేక్షకులు దగ్గరవుతారు.” అని ఆయన వెల్లడించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *